రేపటి నుండి తెలంగాణ లో ఇంటర్ పరీక్షలు ..

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 9.80 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు టెలిమానస్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని, ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుందని చెప్పారు.

అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో సంబంధిత విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించేందుకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని ఖమ్మం రీజియన్ పరిధిలోని అన్ని డిపోల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు R.M వెంకన్న తెలిపారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఇదిలా ఉంటె తెలంగాణ ఇంటర్మీడియట్​వార్షిక పరీక్షలకు హాల్​టికెట్లు విద్యార్థులే తమ హాల్​టికెట్లను నేరుగా పొందేలా అధికార వెబ్​‌సైట్​లో అందుబాటులో ఉంచింది. ప్రథమ ఇంటర్​విద్యార్థులైతే ఎస్​ఎస్​సీ హాల్​టికెట్​నెంబరు, పుట్టిన తేదీని ఎంటర్​చేయడం ద్వారా హాల్​టికెట్లు పొందొచ్చు. ద్వితీయ ఇంటర్​విద్యార్థులైతే రోల్​నంబరు, గత ఏడాది హాల్​టికెట్​నంబర్​, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్​చేసి పొందొచ్చు. బ్రిడ్జి కోర్సు విద్యార్థులైతే ఎస్​ఎస్​సీ పరీక్ష నంబరు, రోల్​నంబరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్​చేయడం ద్వారా హాల్​టికెట్లను డౌన్​లోడ్​చేసుకోవచ్చు.