‘దీపావళి’ కి బాలయ్య 107 టైటిల్ ప్రకటన

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 107 మూవీ టైటిల్ ను దీపావళి కి ప్రకటించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాకిగాను కొన్ని పవర్ఫుల్ టైటిల్స్ ప్రచారం జరిగినప్పటికీ , మేకర్స్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు.

‘దసరా’ పండుగ రోజున టైటిల్ పోస్టర్ రిలీజ్ ఉండొచ్చని అభిమానులు భావించారు. కానీ బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టీజర్ ఈవెంట్ పై ఫోకస్ చేయడం వలన కుదరలేదు. దాంతో బాలయ్య 107వ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రకటన దీపావళికి ఉండబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ , ప్రముఖ మలయాళ నటుడు లాల్ , నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి స్పెషల్ నంబర్ లో ఆడిపాడనుంది. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.