భారతీయ తొలి ‘గే’ మూవీకి ట్రంప్ ప్రశంసలు…

Trump praises Indian debut ‘gay’ movie

బాలీవుడ్ ఇటీవల గే నేపథ్యంతో ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ మూవీని తీసి విడుదల చేసింది.. గే పాత్రలలో ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్ లు నటించారు.. ఇటీవల విడులైన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు లభించాయి.. గే హక్కుల గురించి, వారి ప్రవర్తన గురించి ఈ మూవీలో చక్కగా చూపారంటూ అభినందనలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో  అమెరికాకి చెందిన గే ఉద్య‌మ కారుడు పీట‌ర్‌ ట్విట్ట‌ర్‌లో స్వ‌లింగ సంపర్కం మూవీ   ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ గురించి ప్ర‌స్తావించాడు. బారత్ కూడా గే లపై సానుకూలంగా స్పందిస్తునడానికి ఒక నిదర్శనమంటూ ట్విట్ చేశారు..

ఈ ట్వీట్‌పై ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ గేట్ అని ట్విట్ చేశారు..అమెరికా అధ్యక్షుడు తమ సినిమాను గ్రేట్ అంటూ అభివర్ణించడంతో  చిత్ర నిర్మాణ సంస్థ అనందం వ్యక్తం చేసింది…అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/