నేడు ఢిల్లీకి వెళ్లనున్న జగన్, చంద్రబాబు
జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని అధ్యక్షతన సమావేశం

అమరావతిః సిఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. తదుపరి జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగబోతోంది.
ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. మరోపక్క, చంద్రబాబు కాసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. సమావేశం ముగిసిన వెంటనే జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/