రైతు భరోసా నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్

రైతులకు గుడ్ న్యూస్..రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందో..? అసలు విడుదల చేస్తుందో లేదో..? అని అంత ఎదురుచూస్తున్న వేళ సోమవారం సాయంత్రం రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేసి వారిలో ఆనందం నింపారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొద్దీ రోజులుగా మే 09 లోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తానని చెపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ దీనిపై విమర్శలు చేస్తూ వస్తుంది.

రేవంత్ మాయ మాటలు చెపుతున్నాడని..రైతు భరోసా నిధులు విడుదల చేయడని, లోక్ సభ ఎన్నికల కోసం ఇలా ప్రకటనలు చేస్తున్నాడని , కాంగ్రెస్ హామీల విషయంలో కూడా ఇలాగే చేశాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కురిపిస్తూ వస్తుంది. వీరి ఆరోపణలకు రేవంత్ సైతం కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు. మే 09 లోపు నిధులు విడుదల చేయకపోతే ముక్కు నేలకు రాస్త అంటూ సవాల్ కూడా విసిరారు. ఈరోజు చెప్పిన దానికంటే ముందే నిధులు విడుదల చేసి మాట మీద నిలబడే సీఎం అని నిరూపించుకున్నాడు. కేవలం రైతు భరోసా నిధులే కాదు అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం కూడా రిలీజ్ చేసారు.

నిధుల విడుదలకు ఈసీ అనుమతించడంతో రూ. 15,81,14,000లను విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15,814 ఎకరాల్లో పంట నష్టం జరగగా.. 15,246 మంది రైతులకు పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 10,000 ఎకరాల్ల పంట నష్టం జరగిట్లు ప్రభుత్వం తెలిపింది. సంగారెడ్డిలో అత్యల్పంగా 76 ఎకరాల్లో పంట నష్టపోయిందని వెల్లడించింది. ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నష్ట పరిహారం అందించనున్నారు.

5 ఎకరాలు పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కాంగ్రెస్ సర్కార్ ఈసీ నుంచి అనుమతితో నిధులను విడుదల చేయడం జరిగింది.