చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నెంబర్​ వన్ – ప్రధాని మోడీ

చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో నెంబర్​ వన్ గా ఉంటె.. ఐదేళ్ల లో జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు ప్రధాని మోడీ. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ..గోదావరి మాతకు ప్రణామాలు..ఈ నెల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాసారు. ఇక్కడ నుంచే కొత్త చరిత్ర లిఖించబోతున్నాం అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైసీపీ అవినీతిని జెట్ స్పీడ్ లో పరిగెత్తించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

దేశం, ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యం అని అన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో ఏపీ నెంబర్‌వన్‌గా ఉండేదని, జగన్‌ ఐదేళ్ల ప్రభుత్వంలో పాలన పట్టాలు తప్పిందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా, కానీ, అవినీతి వందశాతం పెరిగిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్డీఏదే అధికారమని మోడీ ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశం కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల వద్ద కోట్ల రూపాయల అక్రమ ధనం ఉందని ఆరోపించారు.