కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు ఢీ కొని ఇద్దరు మృతి

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీ కొని ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మల్లు రవికి మద్దతుగా తలకొండపల్లి మండలం వెల్జాల్ లో ప్రచారం ముగించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారును ఓ బైక్ బలంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న నరేశ్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా… మరో యువకుడు బైరవపాక పరుశరాములుకు తీవ్ర గాయల్యయ్యాయి. దీంతో వెంటనే క్షతగాత్రుడిని కల్వకుర్తిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

అయితే పరశురాములు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను వెంకటాపుర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలోఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కారును ఒక్కసారిగా వేగంగా వచ్చి బైక్ ఢీకొట్టడంతో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.