ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడూ కరెక్ట్ తేదికి జీతాలు ఇవ్వలేదని ఆరోపణలు వినిపించాయి..కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నారు. ఇక వారు కోరుకున్నట్లు ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఫస్ట్ వీక్‌లోనే వేతనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. గత ప్రభుత్వం మాదిరిగా శాలరీస్ కోసం ఎంప్లాయిస్‌ను ఇబ్బందులకు గురిచేయకుండా, జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంఓ నుంచి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సంకేతాలు అందించారు.

జనవరి మాసం నుంచి ప్రతి నెలా మొదటివారంలోనే వేతనాలతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందునా.. అందుకు అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకున్నట్టు తెలిసింది. భవిష్యత్తులోనూ త్వరగా జీతాల చెల్లింపునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల నిర్వహించిన రివ్యూ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఎంప్లాయీస్ జీతాలకు సక్రమంగా ఇవ్వకపోతే ప్రభుత్వ పరువు పోతుందనే అభిప్రాయంతో సర్కారు ఉన్నట్టు తెలుస్తున్నది. సర్కారుకు ఆ మచ్చరాకుండా ఉండేందుకు ప్రతినెలా మొదటివారంలోనే జీతాలు, పెన్షన్లు పక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్టు టాక్.