పోలీసులు అదుపులో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి

డీసీసీబీ డైరెక్టర్‌, బీఆర్‌ఎస్‌ నేత ఇంటూరి శేఖర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. జీళ్లచెర్వులోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారని కాంగ్రెస్‌ నాయకుల ఫిర్యాదు మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంటూరి శేఖర్‌ అరెస్టును ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు ఖండించారు. నేలకొండపల్లి పీఎస్‌ ఎదుట ఎమ్మెల్సీ తాతా మధు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఆందోళనలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే శేఖర్‌ను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.