చంద్రబాబు మెడలో జనసేన కండువా..

టీడీపీ-జనసేన పొత్తు ఖరారైనప్పటికీ..ఇప్పటివరకు టీడీపీ అధినేత చంద్రబాబు మెడలో జనసేన కండువా అనేది ఇంతవరకు కనిపించాలే..కానీ నిన్న బాబు మెడలో కండువా పడింది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. వరుస పర్యటనలతో బిజీ అవుతున్నారు. మరోపక్క వలసల పర్వం కూడా మొదలైంది. వైస్సార్సీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తూ, టీడీపీ , జనసేన లలో చేరుతున్నారు.

ఇక చంద్రబాబు సైతం మూడు రోజులుగా కడప లో పర్యటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. జనసేనకు చెందిన స్థానిక నేతలు తమ పార్టీ కండువా చంద్రబాబు మెడలో అలంకరించారు. దీంతో, ఒక్కసారిగా చంద్రబాబు షాక్ అయ్యారు. కానీ, అక్కడ వెంటనే ఆ కండువాను తీసే ప్రయత్నం చేయలేదు. తీయటం ద్వారా రాజకీయంగా కొత్త వివాదం ఏర్పడుతుందని భావించినట్లు కనిపిస్తోంది. ఇక చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసిన నేతలు తమ పార్టీతో పాటుగా పవన్ కల్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేసారు. ఆ సమయంలో టీడీపీ నేతలు అదే వేదిక పైన ఉన్నారు. అయితే, ఒక పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబుకు జనసేన శ్రేణులు తమ కండువా వేయటం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.