ఏపిలో కొత్తగా మూడు జిల్లాలు!

మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా ఏర్పాటు

ap
ap

అమరావతి: ఏపిలో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. అతి త్వరలో అవి 16 జిల్లాలు కాబోతున్నాయి. ఎందుకంటే ఆఘమేఘాలపై 3 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే… 3 కొత్త జిల్లాల ఏర్పాటుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఐతే… జిల్లాల ఏర్పాటు జరగబోతోందని ఇప్పటికే కొంతమంది వైసీపీ మంత్రులు ఫీలర్స్ రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల ఈ మూడు జిల్లాల ఏర్పాటు జరగబోతోందని తెలిసింది. ఈ మూడే ఎందుకు అంటే… మచిలీపట్నం, అరకు, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఈమధ్య ప్రభుత్వం ప్రకటించింది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/