రాజ్భవన్లో ఘనంగా రాష్ట్ర అవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వీరులకు జోహార్లు తెలిపిన గవర్నర్ తమిళసై.. ఉద్యమకారులకు సన్మానం చేశారు. జై తెలంగాణ అనేది ఆత్మగౌరవ నినాదమని ఈ సందర్బంగా తెలిపారు. కేంద్ర సహకారంతోనే రాష్ట్రంలోఅనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. తన జీవితంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పుకొచ్చింది.

తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధిని మాత్రమే చూడటం కాదని, మారుమూల పల్లెలు కూడా అభివృద్ధి చెందితేనే అసలైన అభివృద్ధి అనిపించుకుంటుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలకు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు.