ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించి , రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి బయలుదేరారు. సెక్రటేరియట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అలాగే ప్రధాని మోడీ , రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము లు సైతం రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు.