మిడతలు దాడి పై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

తెలంగాణ వైపు వచ్చే అవకాశం..అధికారులు సిద్ధంగా ఉండాలన్న సీఎస్ సోమేశ్ కుమార్

locusts

హైదరాబాద్‌: భారత్ లో ప్రవేశించిన మిడతల దండు తెలంగాణలోనూ ప్రవేశిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే రాష్ట్రంలోని 9 జిల్లాలు మిడతల దాడికి గురయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఫారెస్ట్ అధికారులతో పరిస్థితిపై చర్చించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎస్ సూచించారు. దాడి ప్రభావిత గ్రామాలకు ప్రణాళిక తయారు చేయాలని, గ్రామస్థాయిలో టీమ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించాలని, స్ప్రేయర్లు, సేఫ్టీకిట్లు, ఇతర వసతులు ఏర్పాటు చేసుకోవాలని వివరించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/