నిజాం కాలేజీ వద్ద విద్యార్థుల నిరసన

nizam-college-students-protest-for-hostel-facility-for-ug-girl-students

హైదరాబాద్ః నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. హాస్టల్ వసతిని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థినులు హాస్టల్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యార్థుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ప్రిన్సిపాల్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు వినతిపత్రం ఇస్తే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రిన్సిపాల్ తక్షణమే నిర్ణయం ప్రకటించాలని స్టూడెంట్స్ ఆందోళన కొనసాగించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/