తెలంగాణ కాంగ్రెస్ మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదలైంది. ఆదివారం 55 మందితో కూడిన లిస్ట్ ను అధిష్ఠానం విడుదల చేసారు.

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూస్తే..

 1. బెల్లంపల్లె – గడ్డం వినోద్
 2. మంచిర్యాల -కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
 3. నిర్మల్ -కూచాడి శ్రీహరి రావు
 4. ఆర్మూర్- ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
 5. బోధన్ -పి. సుదర్శన్ రెడ్డి
 6. బాల్కొండ- సునీల్ కుమార్ ముత్యాల
 7. జగిత్యాల -T. జీవన్ రెడ్డి
 8. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
 9. రామగుండం ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
 10. మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
 11. పెద్దపల్లి- చింతకుంట విజయ రమణారావు
 12. వేములవాడ- ఆది శ్రీనివాస్
 13. మానకొండూర్ – డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
 14. మెదక్- మైనంపల్లి రోహిత్ రావు
 15. ఆందోల్ – సి. దామోదర్ రాజనర్సింహ
 16. జహీరాబాద్ – ఆగం చంద్ర శేఖర్
 17. సంగారెడ్డి- తురుపు జగ్గా రెడ్డి
 18. గజ్వేల్- తూంకుంట నర్సారెడ్డి
 19. మేడ్చల్- తోటకూర వజ్రేష్ యాదవ్
 20. మల్కాజిగిరి- మైనపల్లి హనుమంతరావు
 21. కుత్బుల్లాపూర్- కొలన్ హన్మంత్ రెడ్డి
 22. ఉప్పల్- ఎం. పరమేశ్వర్ రెడ్డి
 23. చేవెళ్ల – పమేనా భీం భారత్
 24. పరిగి టి. రామ్మోహన్ రెడ్డి
 25. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
 26. ముషీరాబాద్- అంజన్ కుమార్ యాదవ్
 27. మలక్‌పేట్- షేక్ అక్బర్
 28. సనత్‌నగర్- డా. కోట నీలిమ
 29. నాంపల్లి- మహమ్మద్ ఫిరోజ్ ఖాన్
 30. కార్వాన్- ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ
 31. గోషామహల్- మొగిలి సునీత
 32. చాంద్రాయణగుట్ట -బోయ నగేష్ (నరేష్)
 33. యాకుత్‌పురా- కె రవి రాజు
 34. బహదూర్‌పురా -రాజేష్ కుమార్ పులిపాటి
 35. సికింద్రాబాద్- ఆడమ్ సంతోష్ కుమార్
 36. కొడంగల్- అనుముల రేవంత్ రెడ్డి
 37. గద్వాల్ -సరితా తిరుపతయ్య
 38. అలంపూర్ – S.A. సంపత్ కుమార్
 39. నాగర్ కర్నూల్ – డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి
 40. అచ్చంపేట – డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ
 41. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
 42. షాద్‌నగర్- కె. శంకరయ్య
 43. కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు
 44. నాగార్జున సాగర్- జయవీర్ కుందూరు
 45. హుజూర్‌నగర్- నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి
 46. కోదాడ -నలమాడ పద్మావతి రెడ్డి
 47. నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
 48. నకిరేకల్ – వేముల వీరేశం
 49. ఆలేరు – బీర్ల ఐలయ్య
 50. ఘన్‌పూర్ (స్టేషన్) – సింగపురం ఇందిర
 51. నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి
 52. భూపాలపల్లె- గండ్ర సత్యనారాయణరావు
 53. ములుగు సీతక్క
 54. మధిర – భట్టి విక్రమార్క మల్లు
 55. భద్రాచలం- పొదెం వీరయ్య

ఈ జాబితాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ రావులకు సీటు దక్కింది. కానీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​లకు మాత్రం చోటు లభించలేదు. ఖమ్మం నుంచి తుమ్మలకు, పాలేరు సీటు పొంగులేటికి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ స్థానాలపై హైకమాండ్ ఇంకా స్పష్టతకు రాకపోవడం.. మరోవైపు పాలేరు సీటు తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుండటం వల్ల ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.