రౌడీ హీరో తో బాలయ్య ఫస్ట్ ఇంటర్వ్యూ ..

బుల్లితెరపై నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య ‘బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్’ పేరుతో హోస్ట్ చేయబోతున్నారు. న‌వంబ‌ర్ 4 నుండి షో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ షో మొదటి ఎపిసోడ్ కు గాను మోహన్ బాబు హాజరు కాబోతున్నట్లు కొద్దీ రోజులుగా వార్తలు వినిపించిన..తాజా సమాచారం ప్రకారం మొదటి ఎపిసోడ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్ తాలూకా పిక్స్ బయటకొచ్చి ఆసక్తి రేపగా..ఇప్పుడు విజయ్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాడనే వార్త బయటకు రావడం తో ఎపిసోడ్ ఫై ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం షో తాలూకా ప్రమోషన్ కార్య క్రమాలు చేస్తున్నారు.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ మూవీ షూటింగ్ ను పూర్తి చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో ఓ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు.