కన్నడ చిత్రసీమలో విషాదం : ప్రముఖ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ కన్నుమూత

కన్నడ చిత్రసీమలో విషాధచాయలు అల్లుకున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం జయదేవ ఆసుపత్రిలో కన్నుమూశారు. భగవాన్ మృతి పట్ల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు.

భగవాన్ మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు. ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని బొమ్మై ట్వీట్ చేశారు. జూలై 5, 1993లో జన్మించిన భగవాన్.. ‘సంధ్యరాగ’ సినిమాతో దర్శకుడిగా మారారు. తన స్నేహితుడు దొరై రాజ్‌తో కలిసి 55 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ఎక్కువ సినిమాల్లో రాజ్‌కుమార్ హీరోగా నటించారు. ఈ జంట దొరై భగవాన్‌గా ఫేమస్ అయ్యారు. దొరై మరణంతో భగవాన్‌ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. భగవాన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఇటు తెలుగు చిత్రసీమలోను విషాద ఛాయలు కొనసాగుతున్నాయి. నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానం లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని ఉంచారు.