మిస్సైల్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా.. పౌరులకు జపాన్‌ హెచ్చరికలు

North Korea fires multiple ballistic missiles; residents in Japan told to shelter

టోక్యోః ఉత్తర కొరియా (ఈరోజు) గురువారం ఉదయం 7.48 గంటల సమయంలో జపాన్‌ మీదుగా క్షిపణిని ప్రయోగించింది. దీంతో జపాన్‌ ప్రభుత్వం అప్రమత్తమై మియాగి, యమగటా, నీగాటా నివాసితులు ఇండ్లలోనే ఉండాలని సూచించింది. దాదాపు అరగంట తర్వాత క్షిపణి జపాన్ భూభాగాన్ని దాటి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిందని ఆ తర్వాత ప్రభుత్వం, కోస్ట్‌గార్డ్‌ తెలిపింది. ఉత్తర కొరియా బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించడం ఇది రెండోసారి.

పసిఫిక్‌లోకి ప్యోంగ్యాంగ్ రికార్డు స్థాయిలో ఆయుధాల ప్రయోగాలను కొనసాగిస్తోంది. ఉత్తర కొరియా మిస్సైల్‌ ప్రయోగంపై దక్షిణ కొరియా మండిపడింది. చర్యకు ఉత్తర కొరియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు యున్‌ సుక్‌ యోల్‌ హెచ్చరించారు. 1945లో మొదలైన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలవగా.. తొలిసారిగా బుధవారం ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించింది.

ఆ తర్వాత దక్షిణ కొరియా సైతం పలు మిస్సైళ్లను పరీక్షించడంతో పాటు యుద్ధ విమానాలతో విన్యాసాలు చేపట్టింది. ఉత్తర కొరియా రెచ్చగొడుతోందని, దీనికి త్వరలోనే సరైన సమాధానం చెబుతామని దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అయితే, ఉత్తర కొరియా మిస్సైల్స్‌ ప్రయోగంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఆటోని బ్లింకెన్‌ దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి పార్క్‌ జిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. రెచ్చగొట్టే చర్య అని, దీన్ని ఖండిస్తున్నామన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/