మంత్రి విడదల రజనికి అస్వస్థత

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వైద్యులు మంత్రికి ఒఆర్ఎస్ అందించారు. మంత్రి ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేకపోవడంతో అధికారులందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్న మంత్రి విడదల రజని కార్యక్రమాన్ని ముగించుకొని వెంటనే విజయవాడకు బయల్దేరారు. కాగా త్వరలో ఎపిలో ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అధికార ప్రతిపక్షనాయకులు వారి వారి నియోజకవర్గాల్లో బిజీబిజీగా తిరుగుతున్నారు. నిన్న రాత్రి చిలకలూరిపేట నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని అక్కడినుంచి నేరుగా జగ్గయ్యపేటలోని బంధువుల ఇంటికి వచ్చారు మంత్రి రజిని. పని ఒత్తిడి, రెస్ట్ లేకపోవడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.