జుకర్‌బర్గ్‌పై సొంత ఉద్యోగులు ఆగ్రహం

జుకర్‌బర్గ్‌పై సొంత ఉద్యోగులు ఆగ్రహం
facebook ceo mark zuckerberg

కాలిఫోర్నియా: గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పెట్టిన పోస్టుల విషయంపై ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకెన్‌బర్గ్‌ మీద సొంత ఉద్యోగులే అసంతృప్తి వ్యక్తం చేశారరు. కంపెనీ నిర్వహించిన ఆల్‌హ్యాండ్స్‌ సమావేశంలో.. ట్రంప్‌ పోస్టులు ఇప్పటికీ తొలగించలేదంటూ పలువురు సిబ్బంది బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కంపెనీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. మే 25న జార్జిఫ్లాయిడ్‌ అనే నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా అంతటా నిరసనలు వ్యక్త మవుతున్నాయి. దీంతో ‘తమ దేశంలో దోపిడీదారులను కాల్చివేయండి’ అంటూ గతవారం ట్రంప్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ పోస్ట్‌ ద్వారా ఆందోళనకారులను ట్రంప్‌ బెదిరించారు. అయితే ఈ పోస్ట్‌ రెచ్చగొట్టే విధంగా ఉందంటూ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో స్పష్టంగా హింసను ప్రేరేపించారని చెప్పడాన్ని సమర్థించలేమని తాను, సంస్థలోని ఇతర సభ్యులు నిర్ణయించామని, దీంతో ఇది ఫేస్‌బుక్‌ పాలీసిని ఉల్లంఘించలేదని ఆ సమావేశంలో జుకెన్‌బర్గ్‌ వెల్లడించినట్లు సమాచారం. కాగా రెచ్చగొట్టే వ్యాఖ్యల విషయంతో తప్పకచర్యలు తీసుకుంటామని మార్క్‌ చెప్పారు కాని, అది ఇప్పుడు అబద్ధమని తేలిపోయిందని, విద్వేషాన్ని ఆయుధంగా వాడుకునేందుకు సంస్థ సహకరించింది. చరిత్రకు సరికాని మార్గంలో కంపెనీ ఉంది’ అంటూ తిమోతి అవేని అనే సంస్థ సిబ్బంది ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అనంతరం ఆయన పదవికి రాజీనామా చేశారు. 90 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలువురు సిబ్బంది కంపెనీ పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/