ఈసారి ట‌న్నుల కొద్దీ కిక్ అంటున్న ‘కింగ్’

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఈరోజు ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ రోజు సాయంత్రం 6గం.ల‌కు లాంచింగ్ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుండగా, దీనికి సంబంధించిన షూట్ నిన్న‌నే పూర్తైంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి షో ఫై ఇంట్రస్ట్ పెంచారు. తర్వాత సీజన్ కు నాని హోస్ట్ గా చేయగా..ఆ తర్వాత నాగార్జున చేస్తూ వస్తున్నాడు. ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా మేక‌ర్స్ సీజ‌న్ 5కి సంబంధించి కొత్త ప్రోమో విడుద‌ల చేశారు. ఈ ప్రోమోతో రచ్చ ఐదింతలు ఉంటుందని చెప్తున్నారు. ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలానే కిక్ ఈసారి టన్నుల్లో ఉంటుందని చెప్ప‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగాయి. బ‌య‌ట నుండి బిగ్ బాస్ హౌజ్ కూడా చూపించి ఆస‌క్తి రేకెత్తించారు. మరి ఈ బిగ్ రియాలిటీ షో లాంచింగ్ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉండబోబోతుందో..? ఇందులో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ ఎవెరెవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ లోపు ప్రోమో ఫై లుక్ వెయ్యండి.

The BIGG day is here! Get ready for 5-much entertainment…Ikkada kick tonnullo vastundi 👁️ #BiggBossTelugu5 starting today at 6 PM on #StarMaa pic.twitter.com/HasK9Xwn7F— starmaa (@StarMaa) September 5, 2021