రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
లాక్డౌన్ నుంచి పలు రంగాలకు మినహయింపు ఇచ్చే అవకాశం!!

దిల్లీ: దేశంలో విధించిన లాక్డౌన్ రేపటితో ముగియనుండడంతో మరికొన్ని రోజులపాటు లాక్డౌన్ను పొడగిస్తారా? లేదా ప్రాంతాల వారిగా విభజించి సడలిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ రేపు ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే కేంద్ర నిర్ణయంతో సంబంధం లేకుండా పలు రాష్ట్రాలు ఈ నెల 30 వరకు లాక్డౌన్ ను పొడగించాయి. లాక్డౌన్ అంశంపై ఇటీవల అన్ని రాష్ట్రాల సిఎంలతో మోదీ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధాని మోదీ, ప్రజలతో పాటు ప్రపంచమూ ముఖ్యమనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నుండి పలు రంగాలకు మినహయింపు ఇస్తారని తెలుస్తోంది. దేశంలో కరోనా ప్రభావిత ప్రాంతాలను రెడ్,ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి.. అందకు అనుగూనంగా సడలింపు ఇస్తారని తెలుస్తుండగా.. ప్రధాని రేపు ఎలాంటి ప్రకటన చేస్తారో మరి చూడాలి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/