విద్యాపాలనలో కనిపించని సాంకేతికత

ప్రభుత్వాలు దృష్టి సారించాలి

Rural Education System-File
Rural Education System-File

నేటి టెక్నాలజీ యుగంలో దాదాపుగా అన్ని రంగాలలో, అన్ని పరిపాలనా శాఖల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు.

వీడియో కాలింగ్‌, వర్చువల్‌ సమావేశాలు, ఈ కామర్స్‌, నెట్‌ బ్యాంకింగ్‌, యుపిఐ చెల్లింపులు, ఫోన్‌ ద్వారా వినియోగదారుడు అన్ని సేవలను పొందడం నేడు సాధారణంగా చూస్తున్నాం.

కరోనా వల్ల వాటి ఉపయోగం, వాడకం పెరగడమేగాక ప్రజలు వీటిని సౌకర్యవం తంగా భావిస్తున్నారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇతర శాఖల కంటే విద్యాశాఖ వెనుకబడి ఉంది. ఉదాహరణకు తొర్రూ రులో ఉన్న విద్యార్థి ఉప్పల్‌లోని జిల్లాపరిషత్‌ పాఠశాలలో 10వ తరగతి పూర్తిచేశాడు.

అతనికి కావలసిన బదిలీ సర్టిఫికెట్‌, స్టడీ సర్టిఫికెట్‌ తీసుకోవాలంటే విధిగా అక్కడికి వెళ్లాల్సిందే. వెళ్లిన సమయంలో అధికారులు సెలవ్ఞలో ఉంటే మరోసారి వెళ్లాలి.

మరో సందర్భంలో ఒక విద్యార్థి 1-10 తరగతులు నాలుగు లేదా ఐదు పాఠశాలల్లో చదివితే స్టడీ సర్టిఫికెట్ల కోసం ఇన్ని పాఠశాలలు తిరగాలి.

ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంత వ్యయప్రయాసాలు అవసరమా? విద్యార్థులను, వారి తల్లిదండ్రు లను ఇబ్బందులకు గురి చేయడం సబబేనా?

నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విద్యాపాలనలో ‘టెక్నాలజీని అత్యున్నత స్థాయిలో ఉపయోగించడం లేదు. ఒక కేంద్రీకృత వ్యవస్థ లేదు.

ఈ రంగం బాగా వికేంద్రీకరించబడి ఉంది. ప్రతి పాఠశాల ఒక స్వతంత్ర వ్యవస్థలా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ రంగంపై దృష్టి సారించాలి.

విద్యార్థులందరి వివరాలు పూర్తిగా ఆన్‌లైన్‌ చేయాలి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలుండాలి. 1-10 తరగతి ఏయే పాఠశాలల్లో, ఏయే సంవత్సరాలోచదివాడో పూర్తి వివరాలుండాలి.

విద్యార్థి స్వయంగా లాగినై స్టడీ, టి.సి. కండక్ట్‌, డి.ఒ.బి సర్టిఫికెట్లకై దర ఖాస్తుచేసుకుని, నిర్ణీత సమ యం తర్వాత ఆన్‌లైన్‌ ద్వారానే ప్రింట్‌ తీసుకునేలా చేయాలి

. సదరు విద్యార్థి దరఖాస్తును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఆన్‌లైన్‌లోనే ధృవీకరించేలా చేయాలి.

ఇదే విధంగావిద్యార్థి ఒక పాఠశాల నుండి మరో పాఠశాలకు ఆన్‌లైన్‌లోనే స్వయంగా బదిలీ కోరుకునే అవకాశం కల్పించాలి. ఆటోమాటిక్‌గా బదిలీ జరిగేలా చూడాలి.

ఈ సేవలను ఆన్‌లైన్‌ చేయడం ద్వారా ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీకి అడ్డుకట్టవేయవచ్చు.రిపీటర్స్‌ సమస్య కూడా ఉండదు. ఎందుకంటే విద్యార్థి సంవత్సరం పూర్తికాగానే పై తర గతికి సిస్టం మార్చివేస్తుంది.

ఈ సదుపాయాలతో కూడిన గూగుల్‌ యాప్‌ను వెంటనే రూపొందించి అమలులోకి తీసుకురావాలి. పాఠశాలలోని ‘ప్రవేశాల రిజిస్టర్‌ చెదలుపట్టి శిధిలమవుతున్నాయి.

30ఏళ్ల కింద చదివిన వారు కూడా పుట్టిన తేదీ, స్టడీ సర్టిఫికెట్ల కోసంవస్తున్నారు.

సగం చినిగిన రిజిస్టర్లలో పూర్తి వివరాలు ఉండటంలేదు. అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్నఅడ్మిషన్‌ రిజిస్టర్లను ఆన్‌లైన్‌ చేయాలి.

తద్వారా ఎలాంటి సర్టిఫికెట్‌కైనా, ఎవరైనా, బడికి రాకుండానే ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు.

ఇదే విధంగా ఎస్‌ఎస్‌సి పాసైన విద్యార్థులు స్వయంగా ఇంటర్‌ తరహా లో ఆన్‌లైన్‌ ద్వారా రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి.

విద్యాసంవత్సరంలో విద్యార్థుల ప్రతిభను అనగా ఎఫ్‌ఎ, ఎస్‌ఎలలో సాధించిన మార్కులను ఎస్‌ఎమ్‌ఎస్‌, ఈమెయిల్‌, వాట్సాప్‌ మెయిల్‌ లేదా వెబ్‌సైట్‌ల ద్వారా విద్యార్థి,తల్లిదండ్రులు పొందేఅవకాశం కల్పించాలి.

ప్రైవేట్‌ పాఠశాలలు ఇప్పటికే ఇటువంటి సదుపా యాన్ని కల్పిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా టెక్నాలజీని వినియోగించేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలి.

ఇటీవల ప్రారంభించిన ఇ-ఆఫీస్‌ పరిధి లో విద్యాశాఖను తీసుకువచ్చి ఈ సదు పాయాలను కల్పించాలి.

వచ్చే మార్చి2021 ఎస్‌ఎస్‌సి పరీక్షల పేపర్ల మూల్యాంకన పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోవాలి.

-తండ ప్రభాకర్‌ గౌడ్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/