పోషకాహార లోపంతో అనారోగ్య సమస్యలు

జాతీయ పౌష్టికాహార మాసోత్సవాలు

malnutrition
malnutrition

పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు. వ్యక్తి కుటుంబం, సమాజంపై ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది.

ఈ లోపాలు ఆర్థికా భివృద్ధిని దెబ్బతీస్తాయి.పేదరికాన్ని పెంచుతాయి.

పేదరికం,పౌష్టికాహార లోపాలనేవి విషవలయాలుగా మారుతాయి. శారీరక శ్రమశక్తిని తగ్గిస్తాయి.

సంపాదనా సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా ఉద్పాదకత తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ విశ్లేషించింది.

రోగనిరోధకశక్తిని తగ్గించి, అంటురోగాల దుష్ప్రభావాన్ని తీవ్రతరం చేస్తాయి. విద్య,అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

భా రతదేశంలో పౌష్టికాహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనా రోగ్యకరంగా మారింది.దేశంలో ఆరేళ్ల లోపు పిల్లలు 22 కోట్ల మంది ఉన్నారు.

రాబోయే కాలంలో వివిధరంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యం పైనే దేశ ఆర్థిక వ్యవస్థ,సమాజ పురో భివృద్ధి ఆధారపడి ఉంది.

వేగంగా మారుతున్న ప్రపంచంలో అన్ని రంగాల్లో అభివృద్ధిసాధిస్తున్న తరుణంలో ఇప్పటికీ అనేకమంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు.

భారతదేశంలో ఆకలి, పౌష్టికాహారలోపాలపై ఇటీవల విడుదలైన నివేదిక అందరిని కూడా స్పందించేలా చేసింది. దేశం లోని అయిదేళ్లలోపు పిల్లల్లో ఇప్పటికీ 44.3శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది.

పౌష్టికాహార లోపా లపై ఇంతకుముందున్న సాధికారిక నివేదికలు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-3, జిల్లాస్థాయిలో 2016-18లో జరిపిన గృహ సర్వేలు తెలిపాయి.

వాస్తవానికి ఈ సర్వేలతో పోలిస్తే పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య ప్రస్తుతం తగ్గింది. 2016-18లో జిల్లాస్థాయి సర్వేలో ఇలాంటి తక్కువ బరువున్న పిల్లలు 53.1 శాతంగా వెల్లడైంది.

మూడో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని పిల్లల్లో 46 శాతం తక్కువ బరువుతో ఉన్నారు.

ఈ సర్వేను భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించింది. దేశంలోని మూడేళ్లలోపు పిల్లల్లో 47శాతం తక్కువ బరువ్ఞతో ఉన్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్‌ అంచనా వేసింది.

ప్రపంచంలోని మొత్తం పౌష్టి కాహార లోపాలతో ఉన్నపిల్లల్లో మూడోవంతు మనదేశంలోనేఉన్నా రు.

అయితే అధిక వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తున్న కాలంలో కూడా 42 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపాలతో తక్కువ బరువ్ఞతో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికీ 59 శాతం పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదు.

Illness problems with malnutrition

ఈ సమస్య సగం మంది పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంది. దీని ఆధారంగా ఆరోగ్యం,ముఖ్యంగా పిల్లల పౌష్టికాహార సమస్యలపై విధానపరం గా ఎలాంటి ప్రాధాన్యముందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపుఆహార సంక్షోభం,ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇప్పటికే తీవ్రంగా ఉన్న పౌష్టి కాహార సవాళ్లను మరింత జటిలం చేశాయని నివేదికలు తెలుపుతున్నాయి.

పిల్లల్లోనే కాదు, తల్లుల్లో కూడా తీవ్రపౌష్టికాహారలోపాలు న్నాయని వివిధ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. దేశం సాధి స్తున్న ఆర్థిక వృద్ధిరేటుతో పోలిస్తే, భారతదేశం సాధించాల్సిన దానిలో కేవలం సగం మేరకే పౌష్టికాహార రంగంలో సాధించింది.

దేశంలోని మొత్తం మహిళల్లో మూడోవంతు తక్కువ బరువ్ఞతో ఉన్నారు. సూక్ష్మపోషకాల లోపాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దేశంలోని పిల్లల్లో 80శాతం, మహిళల్లో 56 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు.

పోషకాహార రంగంలో కూడా తీవ్రస్థాయిలో సామాజిక, ఆర్థిక అంతరాలున్నాయి.సామాజిక, ఆర్థిక అసమాన తలు,పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్ర మేకాదు. వ్యవస్థలో ఉన్న లోపాలకు, ఆరోగ్యపరమైన లోపాలకు మధ్యస్పష్టమైన సంబంధం ఉందని వివిధ పరిశోధనలు తెలుపుతు న్నాయి.

ఇతర అన్నిరంగాల్లో మాదిరిగానే పౌష్టికాహార లోపాల్లోనూ, అణగారిన వర్గాలప్రజలు తీవ్రస్థాయిలో వెనుకబడిఉన్నారు.

దేశంలో ఉన్న ఇతర కులాల పిల్లలతో పోలిస్తే షెడ్యూల్‌ కులాలు, తెగల పిల్లల్లో తక్కువ బరువ్ఞ పిల్లలు 14 నుంచి 20 శాతం వరకూ అధికంగా ఉన్నారు.అదేవిధంగా పౌష్టికాహార లోపాలను తగ్గించడం కూడా ఈ వర్గాల ప్రజల్లో మందకొడిగా సాగుతోంది.

షెడ్యూల్డ్‌ కులాలు, తెగలే కాకుండా ముస్లింల పిల్లల్లో కూడా పౌష్టికాహార లోపాలు తీవ్రంగా ఉన్నాయి.తక్కువ విద్యాస్థాయి ఉన్న తల్లులున్న కుటుంబాల్లోని పిల్లల్లో పౌష్టికాహార లోపాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

బాలికల్లో పౌష్టికాహార లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదివారిపట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. మనదేశంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా చైనా, వియత్నాం,సెనగల్‌, థా§్‌ులాండ్‌, బ్రెజిల్‌,రష్యా, బ్రిటన్‌ లాంటి దేశాలు 2018 నాటికి పోషకాహార విషయంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలు సాధించే దిశగా ఉన్నాయి.

అయితే భారత్‌ మాత్రం ప్రస్తుతం సాధిస్తున్న ప్రగతితో పౌష్టికాహార రంగంలో సహస్రాబ్ధి లక్ష్యాన్ని సాధించాలంటే 2040 వరకూ ఆగాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

పౌష్టికాహార లోపాల వల్ల ఏర్పడే భౌతిక, ఆర్థిక, విజ్ఞానపరమైన నష్టం దేశ స్థూల దేశీయోత్పత్తిలో మూడుశాతం వరకూ ఉంటుందని అంచ నా.

పౌష్టికాహార లోపాలను సరిదిద్దడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. సమీకృత బాలల అభివృద్ధిసేవల పథకం,మధ్యాహ్నభోజన పథకం, జాతీయ గ్రామీ ణ ఆరోగ్యమిషన్‌, గర్భిణుల, బాలల ఆరోగ్య కార్యక్రమం మొద లైనవి.అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చౌకబియ్యం పథకం లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి.

సమీకృత బాలల అభివృద్ధి సేవలపథకాన్ని 1975లో ప్రారంభించారు.ఈ పథక ముఖ్య ఉద్దే శ్యాలు ఆరేళ్లలోపు బాలల సమగ్రఅభివృద్ధిని సాధించడం,గర్భిణు లు, పాలిచ్చేతల్లులకు పౌష్టికాహారాన్ని,ఆరోగ్య విద్యనుఅందించడం.

ఇది 33 ప్రాజెక్టులు 4,891 అంగన్‌వాడీ కేంద్రాలతో మొదలైంది. ఇప్పటివరకూ 7,706 ప్రాజెక్టులను ఆమోదించారు.

19 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచారు.ఈ పథకం కింద లబ్ధిపొందు తున్న వారి సంఖ్య 959.22 లక్షలు.ప్రజల పౌష్టికాహార స్థాయిని పెంచే విషయంలో వ్యవసాయ అభివృద్ధి కీలకమైంది. ఎందుకంటే ఇప్పటికీ భారత ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగం పాత్రే ప్రధాన మైంది.

దేశంలోని మొత్తం శ్రమశక్తిలో 52 నుంచి 58 శాతం వ్యవసాయరంగంలోనే ఉన్నారు.దేశంలోని మొత్తం గ్రామీణ ఆదా యంలో 55శాతం ఈరంగం నుంచే వస్తోంది. గ్రామీణ మహిళా శ్రమశక్తిలో 80శాతం వ్యవసాయరంగంలోనే ఉంది.

అందువల్ల వ్యవసాయరంగంలో పెట్టుబడులను పెంచి, ఆదాయాలను సమ కూర్చడం ద్వారా మహిళలు,పిల్లల పౌష్టికాహార స్థాయిని పెంచ వచ్చు. కేవలం కొన్ని ఆరోగ్య, పౌష్టికాహార కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించలేం.

వ్యవస్థాగత మార్పుల ద్వారా వ్యక్తిగత, సమాజ, కుటుంబస్థాయిల్లో పౌష్టికాహార స్థితిగతులను మెరుగు పరచవచ్చు.ప్రజల పౌష్టికాహార భద్రతకు, వ్యవసాయ అభివృద్ధి వ్యూహాలకు మధ్య సమన్వయాన్ని సాధించాలి. దేశంలోని 24 శాతం పిల్లలు రోజంతా ఆహారం లేకుండా ఉంటున్నారని సేవ్‌ ది చిల్డ్రన్‌ ఇంటర్నేషనల్‌ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో వెళ్లడైంది.

పంటల రంగంతో పాటు పశుపోషణ, కోళ్లపెంపకం లాంటి రంగాలపై దృష్టి కేంద్రీక రించాలి. ఆహార పంటల సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలి. పోషక విలువలున్న పంటల సాగుకు ప్రోత్సాహకాలు, పెట్టుబడులను సమకూర్చాలి.

Illness problems with malnutrition

ఆహార ద్రవ్యోల్బణం కూడా పౌష్టి కాహార లోపాలకు కారణమవ్ఞతోంది.దేశంలోని 30 శాతం కుటుం బాలు పెరుగుతున్న ధరలవల్ల ఆహార వినిమయాన్ని తగ్గించుకోవా ల్సివచ్చింది.

ప్రజల ఆహార భద్ర తను రక్షించడంలో ఆహారద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కీలకం. పౌష్టికాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు.

వ్యక్తి కుటుంబం, సమాజంపై ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. ఈ లోపాలు ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయి. పేదరికాన్ని పెంచుతాయి.

పేదరికం, పౌష్టికాహార లోపాలు అనేవి విషవలయాలుగా మారుతాయి. శారీ రక శ్రమశక్తిని తగ్గిస్తాయి. సంపాదనా సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా ఉద్పాదకత తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ విశ్లేషిం చింది.

రోగనిరోధకశక్తిని తగ్గించి, అంటురోగాల దుష్ప్రభావాన్ని తీవ్రతరం చేస్తాయి. విద్య,అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

ప్రపంచవ్యాప్తంగా 17శాతం రోగభారానికి పౌష్టికాహా ర లోపాలు కారణమవ్ఞతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా వేసింది.అనేక అంశాలు పిల్లల పౌష్టికాహార స్థితిగతులను ప్రభావి తం చేస్తాయి.

  • కామిడి సతీష్‌రెడ్డి

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/