పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

దేశ రాజధాని అయిన ఢిల్లీలో కాలుష్యం పేరిట ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి తెలిసిందే. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే యుద్ధాలు జరగకుండానే మానవజాతి అంతరించిపోయినా ఆశ్యర్యపడక్కర్లేదు. గతంలో పల్లెటూళ్లు పచ్చని చెట్లతో కళకళలాడుతుండేవి. నేడు అవికూడా పట్టణాలవలే రూపొందుతున్నాయి.

Environmental protection
Environmental protection

ఒకప్పుడు కొన్ని అడుగుల లోతులోనే భూగర్భజలం లభించేంది. కానీ ఇప్పుడు ఎన్ని అడుగుల లోతు తీసినా నీరు దొరకని స్థితికి చేరుకుంటుంది. అభివృద్ధి పేరుతో అడవ్ఞలను నాశనం చేసుకుంటూపోతున్నాం. అందుకే వాటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పెరిగి, సగటు మానవ్ఞన్ని ఒకింత భయాందోళనలకు గురిచేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇది ఏ ఒక్క ప్రాంతమో, రాష్ట్రమో, దేశం సమస్యగాదు. ఇది యావత్తు ప్రపంచం సమస్య.

వే సవికాలం ప్రారంభమైంది. మొదట్లోనే సూర్యుడు తన పత్రాపమేంటో నిరూపించుకుంటున్నాడు. ఫిబ్రవరి చివరి వారంలోనే ఉదయం 9 గంటలకే బయటికి ఎలా వెళతారో వెళ్లండి? చూద్దామన్నట్లుగా? సరాసరి 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్‌నగర్‌ లాంటి ప్రాంతాలలో ఇప్పటికే 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడినట్లు వాతావరణ శాఖ వెల్ల డించింది. ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత 1973లో భద్రా చలంలో 48.6 డిగ్రీలు నమోదుకాగా, పోయిన సంవత్సరం రామగుండంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

ఈ సంవత్సరం సైతం అంతే ఉష్ణోగ్రత నమోదవ్ఞతుందని, అలాగే ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణాలో ఎక్కువగా ఎండలు, వడగాల్పులు నమోదవ్ఞతాయని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేయడం జరిగింది. ఈ ఉష్ణోగ్రతలను చూస్తుంటే రాబోయే సంవత్సరాలను ఊహించుకుంటేనే సగటు మనిషి భయాందోళనలకు గురికాక తప్పదు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణం ఒక్క రాష్ట్రమో, దేశమో కాదు, యావత్తు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు కారణమ వ్ఞతున్నాయి. అనగా ఇది అంతర్జాతీయ సమస్యగా పరిగణించబడుతుంది. వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి పేరుతో పారిశ్రామికీకరణలో భాగంగా సహజవనరులను క్రమంగా నాశనం చేస్తూ వస్తున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలపై ఆధిపత్యం చెలాయించి అక్కడి వనరుల విధ్వంసానికి కారకులు కావడం జరిగింది. అలాగే అన్నీ దేశాలలో పారిశ్రామికరంగం అభివృద్ధి చెందడంతో ముడి పదార్థాలకై సహజవనరులను అంతం చేయడం, నగరీకరణ, పట్టణీకరణ గావించడం, వాహనాల సంఖ్య పెరగడం, వివిధ రకాల ఫ్యాక్టరీలు నెలకొల్పడం, వాటి నుండి వెలువడే వ్యర్థాల వల్ల సైతం వాతావరణంలో పలు మార్పులు జరిగి ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవ్ఞతున్నాయి.

ఈ మధ్యనే దేశ రాజధాని అయిన ఢిల్లీలో కాలుష్యం పేరిట ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి తెలిసిందే. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే యుద్ధాలు జరగకుండానే మానవజాతి అంతరించిపోయినా ఆశ్యర్యపడక్కర్లేదు. గతంలో పల్లెటూరులు పచ్చని చెట్లతో కళకళలాడుతుండేవి. నేడు అవికూడా పట్టణాలవలే రూపొందుతున్నాయి. కొన్ని అడుగుల లోతులోనే భూగర్భజలం లభించేది. కానీ ఇప్పుడు ఎన్ని అడుగుల లోతు తీసినా నీరు దొరకని స్థితికి చేరుకుంటుంది. అభివృద్ధి పేరుతో అడవ్ఞలను నాశనం చేసుకుంటూపోతున్నాం. అందుకే వాటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పెరిగి, సగటు మానవ్ఞన్ని ఒకింత భయాందో ళనలకు గురిచేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఏ ఒక్క ప్రాంతమో, రాష్ట్రమో, దేశం సమస్యగాదు. ఇది యావత్తు ప్రపంచం సమస్య. కావ్ఞన అప్పుడప్పుడు వివిధ దేశాలు అంతర్జాతీయ వేదికల ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి వివిధ దేశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను అందిస్తూ, ఇప్పటి నుంచే ప్రపంచంలోని ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకై పాటుపడితేనే రాబోయే తరాల మనుగడకు తోడ్పాటు చేసిన వారమవ్ఞతాం.

ఇప్పటికే వివిధ పట్టణాలు, నగరాలలో ప్లాస్టిక్‌ కవర్లు వాడకం ఎక్కువైంది. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగి, వాటి నుండి వెలువడే వాయువ్ఞలు సైతం భూతాపం పెరగడానికి దోహదబడుతుంది. అలాగే వివిధ రకాల కంపెనీలు, ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాల ద్వారా సైతం పర్యావరణ కాలుష్యానికి పాల్పడి, వాతావరణం లో ఉష్ణోగ్రత పెరగడానికి కారకులవ్ఞతున్నామనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఇప్పటికైనా ఎక్కడికక్కడా ఆయా ప్రభు త్వాలు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి ముందుకెళ్లినప్పుడు ఎంతో కొంత మేలు జరుగుతుంది.

కానీ పరిరక్షణ అమలుకు నోచుకోకుండా కాలుష్యానికి కారకులమయితే మానవ జీవన మనుగడ ప్రశ్నార్థకమవ్ఞతుందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. మనదేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడు తున్న కొన్ని కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణకు దోహ దపడేటట్లు ఉన్నాయి. హరితహారం పేరుతో ప్రతిగ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు చేయడం మొక్కలు పెంచి, వీధుల వెంట, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో నాటించడం, వాటి బాధ్యతను ఎన్నికలలో గెలుపొందిన నాయకులకు ఇవ్వడం, అలాగే ఈ మధ్యన నియమించబడిన గ్రామ కార్యదర్శులకు ఆ బాధ్యత అప్పగించి వాటిలో తేడాలొస్తే ఉద్యోగాలకే ప్రమాదం వస్తుందని హెచ్చరికలు జారీ చేయడం, మొక్కలు నాటే కార్యక్రమంలో అందరిని హాజరయ్యేటట్లు చేయడం శుభపరిణామం.

దీని ఫలితంగా సక్రమంగా విధులు నిర్వర్తిస్తే రాబోయే కాలంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. దీనితోపాటు మిషన్‌ కాకతీయ ద్వారా గ్రామగ్రామానున్నా చెరువ్ఞలు, పూడికతీసి పూర్వవైభవం తీసుకురావడానికి చేస్తున్న పరిణామం హర్షణీయం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచానికే దిక్సూచీగా నిలవడానికి ఆస్కారం ఉన్నది. కానీ ఫలితం కోసం వేచి చూడక తప్పని పరిస్థితి. ఇంకొక మంచి సంఘటన ఏమైనా ఉన్నదంటే రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం, ఇవన్నీ కూడా ఓట్ల రాజకీయాలకే పరిమితమై తాత్కాలిక ఫలితాలను ఆశించి చేసినట్లయితే ప్రజాధనాన్ని వృధా చేయడంతోపాటు మూర్ఖత్వమే అవ్ఞతుంది కాని మరొకటిలేదు.

పట్టుదల, దీక్షతో దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి విజయం సాధిస్తే రాబోయే తరాలకు మార్గనిర్దేశకంగా నిలవడమేకాకుండా మానవ మనుగడ సజావ్ఞగా సాగేందుకు మార్గాలను సూచించిన వాళ్లవ్ఞతారు. ఇదియేకాకుండా మున్సిపాలిటీల్లో పరిశుభ్రతకు చేసే కార్యక్రమాలు సైతం హర్షణీయం. ఇలాగే భవిష్యత్‌లో రాబోయే పరిణామాలను ముందుగానే అంచనా వేసుకోని దానికితగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైననే ఉన్నది.

ముఖ్యంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్న తరుణంలో ఎలా పునరుద్ధరించాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో, అందులోగల నైపుణ్యం కలిగిన వ్యక్తులతో వాతావరణ పరిశోధకులతో సమావేశాలు, సమీక్షలు నిర్వర్తించి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

వేసవికాలం సమీపించింది. ప్రజానీకానికి సూచనలిస్తూ దానివల్ల ఎవ్వరూ ప్రమాదబారినపడకుండా, పడినా తగిన చర్యలు తీసుకునే విధంగా వైద్యశాలలను వినియోగించుకుంటూ ప్రాణాపాయాల నుండి రక్షించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునే అవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే తరాల భవిష్యత్‌ను కాపాడేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించి సక్రమంగా అమలుపరచడానికి ప్రభుత్వమే కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

సమాజంలోనున్న మేధావ్ఞలందరూ ముఖ్యంగా విద్యార్థుల పాలిట ఉపాధ్యాయులందరూ తగిన జాగ్రత్తలు, సూచనలు అందిస్తూ ప్రాణాపాయాన్ని అరికట్టడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నది. దీనికి సైతం సహకరించాలి. ఏదిఏమైనా రాబోయే తరాలను కాపాడుటకు సమాజంలోనున్న ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి.

  • పోలం సైదులు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/