పట్టుకోసం ప్రపంచదేశాల ఆరాటం!

దేశం : అంటార్కిటికా

Antarctica
Antarctica

ప్రపంచంలో అతిపెద్ద వివాదం మరోటి రాజు కుంటోంది. అదే అంటా ర్కిటికా ఈ భూమిపై అత్యంత శీతల వాతావరణం వేగంతో గాలులు వీస్తున్న ప్రాంతంగాను,ద్రవరూపనీరు అతి ఎక్కు వగా ఉండే ఖండం అంటార్కిటికా. ఈ ప్రాంతానికి సొంతప్రజలంటూ ఎవ్వరూ లేరు.

అయితేప్రపంచంలో ఇది నాలుగో అతిపెద్ద ఖండంగా పేరు వచ్చింది. ఆసియా, అమెరికా, ఆఫ్రికాల తర్వాత స్థానం అంటార్కిటికాదే.ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తమ దంటే తమదని ఎవరికివారే ఏడుదేశాలు సార్వభౌమ త్వాన్ని ప్రకటిస్తున్నాయి.

14 మిలియన్ల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో కొంత భాగం పైనే ఇప్పుడు ఈ పోటీ నెలకొంది. పొరుగుననే ఉన్న అర్జంటైనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్‌ దేశాలు మాదే అంటుంటే ఫ్రాన్స్‌, నార్వే, బ్రిటన్‌ లాంటి సుదూరంగా ఉన్న ఐరోపా దేశాలు కూడా ఈప్రాంతాలపై తమకు సార్వభౌమాధికారం ఉందని వాదిస్తున్నాయి.

అయితే అంటార్కిటికాలో శాశ్వత స్థావరాన్ని 190-4లోనే అర్జంటైనా ఏర్పాటు చేసింది. అత్యంత ప్రాచీనమైన ద ఆర్కడాస్‌బేస్‌ ఆ దేశానిదే. దక్షిణ అమెరికా దేశం అర్జంటైనా అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలు తమ దక్షిణ ప్రావిన్స్‌లు టీర్రా, డెల్‌ప్యూగో, మాల్వినాస్‌, దక్షిణ జార్జియా, దక్షిణ శాండ్‌విచ్‌ ఐలాండ్స్‌కు కొనసాగింపు ప్రాంతమని ప్రకటించింది.

ఇప్పటికీ కొన్ని ద్వీపాలు బ్రిటన్‌ ఆధీనంలో ఉన్నాయి. 1908లోనే ఈ ప్రాంతంపై తమకు అధికారం ఉందని బ్రిటన్‌ వాదిస్తోంది.ఇక 1940ప్రాంతంలో చిలీ తెరపైకి వచ్చి తమదే అధికారం అన్నారు. ఇక రానురాను 20వ శతాబ్దం నాటికి కొన్నిదేశాలు తమ నావికుల అన్వేషణ లో గుర్తించినట్లు ఈప్రాంతం తమదేనని వాదిస్తు న్నాయి. 1911లో దక్షిణ ధ్రువానికి చేరిన తొలి నావికుడు రోల్డ్‌ అముండ్సెన్‌ అన్వేషణ పేరుతో ఇక్కడ కొన్నిప్రాంతాలు తమవేనని నార్వే ప్రకటించుకుంది.

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు కూడా బ్రిటిష్‌ నావికుడు జేమ్స్‌క్లార్క్‌రాస్‌ అన్వేషణతో బైటపడిందని తమకే ఈప్రాంతంపై అధికారమని చెపుతున్నాయి. బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఈ రెండు దేశాలు అంటార్కిటికా తమదేనంటున్నాయి.

1840లో కమాండర్‌జూలెస్‌ డ్యుమెంట్‌ డ్యూర్విల్‌ అన్వేషణతో ఈ ప్రాంతాలు గుర్తించామని ఫ్రాన్స్‌ వాదిస్తోంది. మొత్తంగా చూస్తే 35దేశాలు శాశ్వతస్థావరాలను ఏర్పాటు చేసాయి. వివాదం కొనసాగుతుండగానే 1959లో ఏడుదేశాల సరసన మరో ఐదుదేశాలు చేరాయి.బెల్జియం,అమెరికా, జపాన్‌, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలుచేరాయి.

దీనితో ది అంటార్కిటిక్‌ ఒప్పందం పేరిట ఒక ఒప్పందం కూడా చేసు కున్నారు.శాంతియుత మార్గాలు, అంతర్జాతీయ పరిశోధనల కోసం విని యోగించాలని ఈ ఒప్పందం లో ఉంది. అణుపరీక్షలు, సైనిక చర్యలపై కూడా నిషేధం ఉంది. క్రమంగా ఈ ఒప్పందంపై 42దేశాలు సంతకాలు చేసాయి. 29 దేశాలు మాత్రమే ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నాయి.ఎందుకింతపట్టు పడుతున్నా యంటే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. విలు వైన ఖనిజవనరుల అపారంగా ఉన్నాయి.

గల్ఫ్‌దేశాల వద్ద ఉన్నంత చమురు నిల్వలు ఈప్రాంతంలో ఉన్నా యి. రెండులక్షల మిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు న్నట్లు ప్రాథమిక అంచనాలు వేసారు.చమురు, సహజ వాయువుతోపాటు బొగ్గు, సీసం, ఉక్కు, క్రోమియం, రాగి, బంగారం,నికెల్‌, ప్లాటినం, యురేనియం, వెండి నిక్షేపాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

బహుశా అందుకేనేమో ఈ దేశాలన్నీ అంటా ర్కిటికా తమదంటే తమదని పట్టుబడుతున్నాయి. మూడేళ్ల క్రితమే అర్జంటైనా 1.6 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల సముద్రప్రాంతంపై హక్కులు కోరింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఖండాల సరిహద్దుల కమిషన్‌ నుంచి ఈ హక్కులు కూడా పొందగలిగింది. ఇక్కడ ఆరుకిలో మీటర్ల లోతువరకూ కూడా మంచు పలకాలే ఉంటాయి.

గడ్డకట్టిన మంచు రూపంలో ఎక్కడా లేనంత మంచి నీరు ఉంది. భవిష్యత్తులో బంగారంకంటే విలువైనదిగా మారుతుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఉండే నీటిలో 70శాతం అంటార్కి టికాలోనే ఉందని చెపుతారు. భూమిపై ఉన్నమంచులో 90శాతం అంటార్కిటికా లోనే ఉంది. చైనా కూడా ఈప్రాంతంపై కన్నేసింది.

తియాషన్‌ స్థావరాన్ని నిఘాకోసం ఉపయోగించుకుం టున్నదని ఆస్ట్రేలియా ఐదేళ్లక్రితమే ఆరోపించింది. అయితే ఇప్పటికీ ఈ ఖండంపై వేటికీ పూర్తి హక్కులు లేవు. ఐక్యరాజ్య సమితి ఖండాల సరిహద్దుల కమిషన్‌ మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది.

పురాతన కాలం నుంచే బ్రిటన్‌ తమదే హక్కులని ప్రకటిస్తోంది.బ్రిటిష్‌ పాలన కింద మగ్గిన న్యూజిలాండ్‌ ఆస్ట్రేలి యాలు సైతం తమవేనని వాదిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు చూస్తే ప్రపంచంలోని 35 దేశాలు ఇక్కడ శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి.

వాస్తవానికి ఈప్రాంతం ఏ దేశానికీ చెందదనే చెప్పాలి. వందల ఏళ్ల క్రితం నుంచి అంటార్కిటికాలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న దేశాలు అప్పటి నుంచి తమవేనని వాదించడానికి అసలు కారణం అపారమైన ఖనిజవనరులే. అయితే అంటార్కిటికా ఒప్పందం జరగడంతో ఇప్పుడు ఎలాంటి సైనిక చర్యలకుగాను, చమురు సహజవాయు అన్వేషణలు, ఖనిజవనరుల వెలికితీతకు విఘాతం కలిగింది.

వాస్తవానికి ఈ ప్రాంత పరిధిని నిర్ణయించా ల్సింది ఎవరు? ఏయే దేశాలకు ఈప్రాంతంపై హక్కు లుంటాయన్న అంశాలను పరిగణనలోనికి తీసుకుంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రత్యేక విభాగం ఖండాల సరిహద్దుల వివరాలు సమగ్ర అవగాహన ఉన్న ఈ విభాగమే నిర్ణయించాల్సి ఉంది.

అయితే ఎప్పటికీ ఎడతెగని వివాదంగా కొనసాగుతున్న అంటార్కిటికా ఆధిపత్యం మొత్తం ఐక్యరాజ్యసమితి పరిధిలోనే ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.

  • గన్ని మోహన్‌

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/