సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం

అనకాపల్లి జిల్లా సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ కు రంధ్రం పడటంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు చెపుతున్నారు. అయితే, సాంకేతిక సమస్య ను పునరుద్ధరణ సమయం పట్టే అవకాశం ఉందని, కనీసం మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు ప్రస్తుతం మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్.. విశాఖ శివారు ప్రాంతంలో ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రం.. ఇది భారత ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ చే నిర్వహించబడుతుంది. ఎన్టీపీసీ యొక్క బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలలో ఈ విద్యుత్ కేంద్రం ఒకటి. పవర్ ప్లాంట్ కోసం బొగ్గును ఒడిశాలోని తాల్చేర్ బొగ్గు గనులలోని కళింగ బ్లాక్ సమకూరుస్తారు.. ఈ ప్లాంట్ ఆస్తి, నిర్వహణ జాతీయ స్థాయిలో ఉంటుంది.. ఇక, విద్యుత్ బహుళ రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం చేయబడుతుంది. యూనిట్లు 1, 2 ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్, 1,000 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేయబడుతుంది.