దానం నాగేందర్ ఫై బిఆర్ఎస్ అనర్హత వేటు ?

బిఆర్ఎస్ నుండి గెలిచి..కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫై అనర్హత వేటు వేసేందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధం అయ్యారు. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌ను సమర్పించేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యేల బృందం స్పీకర్‌ను కలిసేందుకు ఆదివారం అపాయింట్‌మెంట్‌ కోరింది.

స్పీకర్‌ ఇంట్లో లేకపోవడంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు అక్కడే నిరీక్షించారు. తాము ఎదురుచూస్తున్నామని పలుమార్లు ఫోన్‌ చేసినా స్వీకర్‌ స్పందించలేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ముందు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి కలవకపోవడం బాధాకరమని పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్‌ తమను కలవలేదని ఆరోపించారు. సోమవారం మరోసారి కలిసి ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేసే పిటిషన్‌ను సమర్పిస్తామని చెప్పారు.