నేడు జగిత్యాలలో ప్రధాని మోడీ భారీ సభ ..

ప్రధాని మోడీ రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. నిన్న చిలకలూరి పేట లో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న మోడీ..ఈరోజు జగిత్యాలల జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి జగిత్యాలకు ప్రధానమంత్రి మోడీ బయలుదేరానున్నారు. మోడీ పాల్గొనే విజయ సంకల్ప సభ కు బీజేపీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న హెలిపాడ్ వద్దకు మోడీ చేరుకోన్నారు. అయితే.. హేలిపాడ్ వద్ద 20 మంది నాయకులకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు.

ఉదయం 10:45ని లకు జిల్లా కేంద్రంలోని గీతవిద్యలాయం ఆవరణలో జరగనున్న విజయసాంకల్ప సభ ప్రాంగనానికి రోడ్ మార్గాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరకొనున్నారు. సభ వేదికపై కరీంనగర్ నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉండనున్నారు. ప్రధాని పర్యటన బహిరంగ భద్రత కోసం మూడు జిల్లాల నుంచి 1600 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి వారికి బందోబస్తును సెక్టార్లుగా విభజించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు.