ఇళ్ళు మేము కట్టిస్తే…వైఎస్‌ఆర్‌సిపి రంగులు వేసుకుందిః యనమల

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతిః మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఏపి ప్రభుత్వం పై మరియు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగనన్న కాలనీలలో గృహప్రవేశాల అంశంపై తనదైన శైలిలో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. జగన్ చేస్తున్న పనులు చూస్తుంటే చాలా బాధగా ఉంది, ఇంకా నిర్మాణాలు కూడా పూర్తి కాని ఇళ్లను ప్రారంభిస్తున్నారు అంటూ యనమల సెటైరికల్ కామెంట్స్ చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో ఇళ్లను నిర్మిస్తే ఆ తర్వాత వచ్చిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రంగులు వేసుకుందంటూ ఆరోపించారు. పైగా దీనికి ఆ ఇళ్లను కట్టించింది మేమే అంతో జగన్ అండ్ కో గొప్పలు చెప్పుకుంటున్నారు ఇది రాష్ట్రంలో దాపురించిన దౌర్భాగ్య పరిస్థితి అంటూ రెచ్చిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరుతో ఎస్సి, ఎస్టీ మరియు బీసీ లను దారుణంగా మోసం చేశారంటూ మండిపడ్డారు.