కారును పోలిన గుర్తులను తొలగించాలి.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన

మరెవరికీ ఆ గుర్తులు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలన్న బిఆర్ఎస్

brs-filed-writ-petition-in-delhi-high-court-seeking-not-to-assign-car-like-symbols-to-any-party

అమరావతిః కారును పోలిన గుర్తులు తెలంగాణలోని అధికార బిఆర్ఎస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయిస్తుండడం వల్ల తమకు తీరని నష్టం జరుగుతోందని, బిఆర్ఎస్‌కు ఓటు వేయాలని వచ్చిన వృద్ధులు ఆ గుర్తులను కారుగా భ్రమపడి వాటికే వేస్తున్నారని పేర్కొంది. కాబట్టి తమ గుర్తును పోలిన గుర్తులను ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ బిఆర్ఎస్ తరపున న్యాయవాది మోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దీనిపై నేడు విచారణ చేపట్టనుంది.

కాగా, రోడ్డు రోలర్‌తో పాటు చపాతి రోలర్‌, సోప్‌డిష్‌, టెలివిజన్‌, కుట్టుమిషన్‌, ఓడ, ఆటోరిక్షా, ట్రక్కు గుర్తులు కారును పోలి ఉండడంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించొందని బిఆర్‌ఎస్‌ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఆయా గుర్తులతో బిఆర్‌ఎస్‌కు నష్టం జరుగుతుందని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల కేంద్రం ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలోనూ కారు గుర్తును పోలిన ఫ్రీ సింబల్స్‌ను తొలగించాలని బిఆర్‌ఎస్‌ పార్టీ కోరింది. అయితే, ఇప్పటి వరకు ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో పిటిషన్‌ను దాఖలు చేసింది.