వివాహం బంధంతో ఒకటైన నరేష్ – పవిత్రలు

సీనియర్ హీరో నరేష్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటీకే ఇద్దర్ని పెళ్లి చేసుకున్న నరేష్..తాజాగా సీనియర్ నటి పవిత్ర ను వివాహం చేసుకున్నాడు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గత కొద్దీ రోజులుగా సహజీవనం కొనసాగిస్తున్న వీరిద్దరూ ఈ మధ్యనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. నరేష్‌కు ఇది మూడో వివాహం కాగా, పవిత్రకు ఇది రెండో పెళ్లి. కొత్త ఏడాది సందర్భంగా కొత్త ప్రారంభాలు అని .. వారి మధ్య రిలేషన్‌ను వీడియో రూపంలో అనౌన్స్ చేసిందీ ఈ జంట.

ఇప్పుడు తాజాగా మరో వీడియోతో సంచలనం సృష్టించిందీ. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియోలో కొద్ది మంది అతిధులు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే నరేష్, అతని మూడో భార్య రమ్య మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ సమయంలో ఈ పెళ్లి వివాదాస్పదంగా మారింది. వీరి వివాదం కోర్టులో ఉండగానే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై రమ్య ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.