రేపు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం లో టీడీపీ భారీ సభ

రేపు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం లో టీడీపీ భారీ సభ నిర్వహించబోతుంది. టీడీపీ శంఖారావం పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఇందుకోసం చంద్రబాబు హైదరాబాద్ నుంచి భారీ వాహనశ్రేణితో ఖమ్మం కు చేరుకోనున్నారు. దాదాపు ఐదు లక్షల మందితో ఈ సభ నిర్వహిచబోతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా తెలంగాణ ఫై ఫోకస్ చేయని చంద్రబాబు..మళ్లీ ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో టీడీపీ అనేది లేనే లేదు. గతంలో ఉన్న నేతలంతా టిఆర్ఎస్ లో చేరిపోయారు. రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ లో చేరి , టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. ఈ క్రమంలో రీసెంట్ గా తెలంగాణ టీటీడీపీ పగ్గాలు కాసాని జ్ఞానేశ్వర్‌ కు అప్పగించారు చంద్రబాబు.

ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచుతుండగా.. పార్టీలు నేతల, దూకుడుతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అయితే.. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో విపక్ష పార్టీలు నిత్యం జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సైతం దృష్టి సారించారు. గతంలో వరద ప్రభావిత గ్రామాల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉండడం తో రేపు ( డిసెంబర్ 21న) భారీ సభ నిర్వహించబోతున్నారు. మరి ఈ సభలో చంద్రబాబు ఏం మాట్లాడతారో..? ఎలాంటి వాగ్దానాలు ఇస్తారో చూడాలి.