వెలుగులోకి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి మరో వీడియో

Another video of YCP MLA Pinnelli came to light

అమరావతిః ఎన్నికలు జరుగుతుండగా అనుచరులతో కలిసి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు మరో వీడియో బయటకు వచ్చింది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పగలగొట్టి బయటకు వచ్చిన పిన్నెల్లిని ఓ మహిళ నిలదీసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పిన్నెల్లి ఆమెను దుర్భాషలాడుతూ వేలు చూపించి బెదిరించారు. తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది.