టీడీపీలో ఆగని అసంతృప్తి జ్వాలలు

tdp-chandrababu

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల్లో టెన్షన్ పడుతుండగా..టిడిపి మాత్రం మరో టెన్షన్ కూడా జత అయ్యింది. పార్టీ లో అసంతృప్తి జ్వాలాలు రోజు రోజుకు ఎక్కవైపోతున్నాయి. ఈసారి పొత్తులో భాగంగా చాలామందికి సీట్ల సర్దుబాటు అనేది చేయలేకపోయారు. దీంతో టికెట్ దక్కని నేతలంతా అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ ని వీడడం..అసంతృప్తి వ్యక్తం చేయడం చేస్తున్నారు. తాజాగా మూడో జాబితా టికెట్ల కేటాయింపు అగ్గి రాజేసింది. టికెట్ దక్కని నేతలంతా రగిలిపోతున్నారు. శ్రీకాకుళం టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, S. కోట టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అమలాపురం సీటును ఆనందరావుకు కేటాయించడంతో ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతోంది. ఇటు తిరుపతి(D) సత్యవేడు అభ్యర్థి ఆదిమూలంను మార్చాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే క్రమంలో టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా సైతం టికెట్ దక్కలేదని వైసీపీ లోకి చేరాలని అనుకోవడం తో ఆయనతో అధినేత చంద్రబాబు బుజ్జగించారు. పొత్తులో జరిగిన సర్దుబాట్లను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. బాబు బుజ్జగింపుతో రాజా మెత్తబడ్డారు. మరోవైపు బాపట్ల ఎంపీ సీటు ఆశించిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు కూడా బాబును కలిశారు. కాగా తెనాలి సెగ్మెంట్ జనసేనకు కేటాయించడంతో ఆలపాటికి టికెట్ దక్కలేదు. ఇదిలా ఉంటె వరుసగా 5 సార్లు ఓడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బాబు టికెట్ ఇవ్వడం విశేషం. ఆయనకు ఆరోసారి టికెట్ కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మరి ఎప్పుడైనా విజయం సాధిస్తారో లేదో చూడాలి.