లిక్కర్ కేసులో కవితకు బెయిల్ వస్తుందా..?

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తును కోర్టు పరిశీలించనుంది. కాగా కవితను ఈ నెల 15న ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ ఈరోజు కోర్ట్ లో హాజరు పరచనున్న తరుణంలో కవిత కు బెయిల్ వస్తుందా..? లేక మరోసారి ఈడీ కస్టడీకి పంపిస్తారా..? అని అంత టెన్షన్ పడుతున్నారు. మరోపక్క ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాలాను కూడా అరెస్ట్ చేయడంతో ఇద్దర్ని కలిపి విచారణ చేయాలనీ..దీనికి గాను అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్ట్ ను కోరుతున్నారు. మరి కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటె ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టి అక్రంగా అరెస్ట్ చేసారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఢీల్లీలో ఎంపీలు నామా, కే.ఆర్ సురేష్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో కవితా బాధితురాలని, నిందితురాలు కాదని వారు పేర్కొన్నారు. ఇన్ని రోజులు సాగదీసి, లోక్ సభ ఎన్నికలకు ముందు కేసును తెరపైకి తేవడం రాజకీయ కోణమన్నారు . తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందన్నారు.