మరోసారి మెగా ఛాన్స్ కొట్టేసిన బెబమ్మ

ఉప్పెన చిత్రంతో మెగా హిట్ అందుకున్న బెబమ్మ(కృతి శెట్టి)..మరోసారి మెగా మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు యూత్ ను తనవైపు తిప్పుకుంది. ఉప్పెన తర్వాత వరుసపెట్టి అమ్మడికి ఛాన్సులు వస్తున్నాయి. రీసెంట్ గా నాని తో శ్యామ్ సింగ రాయ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టింది. ఇక సంక్రాంతి బరిలో బంగార్రాజు మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన జోడి కట్టింది. అలాగే రామ్ తో ఓ మూవీ చేస్తుంది. ఇలా వరుస సినిమాలో లైన్లో ఉండగానే..తాజాగా మెగా ఛాన్స్ అమ్మడికి తగిలినట్లు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ‘సేనాపతి’ చిత్రంతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆహాలో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. రాజేంద్రప్రసాద్ నటనకి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ విజయోత్సాహంతో సుస్మిత మరో సినిమాని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుస్మిత నిర్మించబోయే ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నట్టు సమాచారం. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దీనికి డైరెక్షన్ చేయబోతున్నాడట. త్వరలోనే ఈ మూవీ తాలూకా వివరాలు తెలియనున్నాయి.