నేడు కాంగ్రెస్లోకి హైదరాబాద్ మేయర్?

హాట్ సమ్మర్ లో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఇక.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మరికొందరు పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఇంటికి వెళ్లారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో మంతనాలు జరిపి, తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈరోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈరోజు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ ను వీడి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.