వైస్సార్సీపీ కండువా కప్పుకున్న టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌ర‌ళాదేవి

టీడీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. రాష్ట్ర కార్య‌ద‌ర్శి వావిలాల స‌ర‌ళాదేవి బుధువారం సీఎం జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జగన్ స‌మ‌క్షంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ చేనేత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వావిలాల సరళాదేవి, ఆమె భర్త వావిలాల వెంకట రమేష్ వైస్సార్సీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్న ఆమె .. అక్కడ తగిన గుర్తింపు లభించకపోవడంతో ఈరోజు వైస్సార్సీపీ లో చేరిపోయారు.

ఇదిలా ఉంటె మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైస్సార్సీపీ నేత కాండ్రు శ్రీనివాసరావు వైస్సార్సీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరారు. గత ఎన్నికల్లో స్ధానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయానికి కృషిచేసిన శ్రీనివాసరావు.. ఆ తర్వాత ఆయన పట్టించుకోకవడంతో పార్టీకి దూరమయ్యారు. ఈరోజు ఆయన టీడీపీ యువనేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.