ఈరోజు, రేపు విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌

ఈరోజు , రేపు విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 జరుగనుంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సుకు ఏయూ గ్రౌండ్స్‌ సిద్ధమైంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కోసం అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసారు. 3వ తేదీ (రేపు) ఉదయం 9 గంటల నుంచే పారిశ్రామికవేత్తల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటలకు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను ముఖ్యమంత్రి సీఎంజగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

గ్లోబల్ ఇన్వర్టర్ సమ్మిట్ 2023 ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడునున్నాయి. ఇది ఇలా ఉండగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 లో భాగంగా విశాఖకు వచ్చే ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఆంధ్ర వంటకాలు అయిన రాగిసంకటి, నెల్లూరు చేపల పులుసు ఇలా అనేక రకాల వంటకాలను ఏర్పాటు చేసింది.

ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగావకాశాలు మెరుగుపరిచే విధంగానే కాకుండా రాష్ట్ర ఆదాయ వనరులు కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా బోగస్‌ ఎంవోయూలు ఈ సమ్మిట్‌లో ఉండవని చెప్పారు. అన్ని ఏర్పాట్లు గమనించిన తరువాతే పారిశ్రామిక వేత్తలతో ఎంవోయూలు, ఒప్పందాలు చేసుకునే కార్యక్రమం జరుగుతుందన్నారు.