టిడిపి పురపాలక ఎన్నికల మేనిఫెస్టో విడుదల

అమరావతి: ఏపి పురపాలక ఎన్నికల నేపథ్యంలో టిడిపి ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. 10 అంశాల‌ను ఈ పుర‌పాలక ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుపరిచారు. మంగ‌ళ‌గిరిలోని టిడిపి కేంద్ర‌ కార్యాల‌యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, వ‌ర్ల రామ‌య్య కూడా పాల్గొన్నారు. ‘ప‌ల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మ‌నవంతు’ పేరిట మేనిఫెస్టోను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… ‘ఆర్టీసీ బ‌స్సు చార్జీలు పెంచారు. పెట్రోలు, డీజిల్ చార్జీలు పెంచారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో లీటరు పెట్రోలు రూ.200 దాటేట‌ట్లు ఉంది. అన్నింటిపై ప‌న్నులు పెంచేశారు. సిమెంటు, గ్యాసు ధ‌ర‌లు పెరిగాయి’ అని విమ‌ర్శించారు.

‘ప‌ట్ట‌ణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ దోపిడీ చేస్తున్నారు. విద్యుత్తు చార్జీల‌ను విప‌రీతంగా పెంచారు. కుడి చేతితో రూ.10 ఇచ్చి ఎడ‌మ చేతితో రూ.100 లాక్కుంటోంది ఈ జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం. ప్ర‌జ‌లు పుర‌పాలికల నుంచి ఏం ఆశిస్తున్నారో, ఏ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కోరుకుంటున్నారో ఆయా కార్య‌క్ర‌మాల‌ను టిడిపి చేస్తుంది’ అని లోకేశ్ అన్నారు. ‘ గన్ను క‌న్నా ముందు జ‌గ‌న్ వ‌స్తాడ‌ని ప్ర‌చారం చేసుకున్నారు. బుల్లెట్టు లేని గ‌న్నులా ప‌రిస్థితి ఉంది. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారి గురించి ప‌ట్టించుకునే వారే లేరు’ అని లోకేశ్ విమ‌ర్శించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/