కరోనా ప్రభావం.. రాకెట్‌ ప్రయోగ కేంద్రం మూసివేత

ఈ నెల 31 వరకు … వెల్లడించిన అధికారులు.

raket lanching station
raket lanching station

శ్రీహరికోట: కరోనా ప్రభావం ఏ రంగాన్ని వదలడం లేదు. ఇప్పటికే అన్ని రంగాలను ఇది అతలాకుతలం చేసింది. తాజాగా ఈ వైరస్‌ ధాటికి శ్రీహరికోటలోని అంతరిక్షకేంద్రం కూడా మూతపడింది. ఈ నెల 31 వరకు రాకెట్‌ ప్రయోగ కార్యక్రమాలు అన్ని కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కేవలం అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రమే హజరుకావాలని ఉత్తర్వులు జారీచేశారు. దీనితో పాటు షార్‌ కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/