తారకరత్న మృతి నుండి ఇంకా కోలుకోకముందే టీడీపీ లో మరో విషాదం

టీడీపీ పార్టీ ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కీలక నేతలంతా పలు కారణాలతో కన్నుమూస్తున్నారు. రీసెంట్ గా నందమూరి తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త నుండి ఇంకా బయటకు రాకముందే పార్టీ లో మరో కీలక నేత కన్నుమూశారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవలే గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయన మరణం పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1957 జులై 4న కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో.. సుబ్బయ్య- అచ్చమ్మ దంపతులకు బచ్చుల అర్జునుడు జన్మించారు. బి.ఏ వరకు చదివిన ఆయన ఏపీ శాసనమండలికి 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 1995 నుంచి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు.

2000 నుంచి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా , 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017లో ఏపీ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో.. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2020 లో టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి దూరం కావడం తో అర్జునుడు గన్నవరం బాధ్యతలు తీసుకున్నారు. ఇక తీసుకున్న కొన్ని రోజులకే హాస్పటల్ పాలవ్వడం ..ఇప్పుడు కన్నుమూయడం జరిగిపోయింది.