పంజాబ్‌ బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. నలుగురు మృతి

firing-incident-at-bathinda-military-station-in-punjab

బఠిండా: పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకున్నదని ఆర్మీ ప్రకటించింది. వెంటనే క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు స్టేషన్‌ను చుట్టుముట్టాయని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయని వెల్లడించింది. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టామని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, కాల్పులు వినిపించగానే స్టేషన్‌లోని క్విక్‌ రియాక్షన్ బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేశారు. కార్డన్‌ సెర్చ్‌ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు.