గుండెపోటుకు గురైన సుస్మితా సేన్ ..

కరోనా తర్వాత గుండెపోటులు అనేవి ఎక్కువయ్యాయి. చిన్న , పెద్ద అనే తేడాలేకుండా అందరికి గుండెపోటులు వస్తున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న వారు సడెన్ గా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. చిత్రసీమలో సైతం ఈ మధ్య గుండెపోటుతో పలువురు మరణించడం జరిగింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ గుండెపోటుకు గురైంది. ఈ విషయాన్ని సుస్మితా స్వయంగా వెల్లడించారు. రెండ్రోజుల కిందట తనకు గుండెపోటు వచ్చిందని, వైద్యులు యాంజియోప్టాస్టీ చేసి, గుండెకు స్టెంట్ అమర్చారని తెలిపింది. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రమాదం నుండి తనను గట్టెక్కించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నేను క్షేమంగానే ఉన్నానన్న శుభవార్తను అభిమానులతో పంచుకునేందుకే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాల్సి వచ్చిందని తెలిపింది.

1975 నవంబరు 19న హైదరాబాదులో సుస్మిత జన్మించింది. ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ భారత వాయు సేనలో వింగ్ కమాండర్‌గా పనిచేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్, నగలు డిజైనర్. హైదరాబాదులో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. 1994లో 18వ యేట భారత సుందరి పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకొంది. అప్పుడు రెండవ స్థానం పొందిన ఐశ్వర్య రాయ్ అదే సంవత్సరం ప్రపంచ సుందరి పోటీలో మొదటి స్థానం పొందింది. ఆ విధంగా ఒకే సంవత్సరం ఇద్దరు భారతీయ వనితలు “ప్రపంచ సుందరి”, “విశ్వ సుందరి” పోటీలలో మొదటి స్థానాలు సంపాదించారు. తెలుగు లో ఈమె నాగార్జున సరసన రక్షకుడు అనే మూవీ లో నటించింది.