రాజధాని ప్రాంతాల్లో నేడు టిడిపి నేతల పర్యటన

Telugu Desam Party
Telugu Desam Party

అమరావతి: ఏపి రాజధాని ప్రాంతాల్లో బుధవారం టిడిపి బృదం పర్యటించనుంది. అమరావతి పరిసర ప్రాంతాలు మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో టిడిపి నేతలు పర్యటించనున్నారు. కాగా రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు, విద్యార్థులు 57 రోజులుగా నిరనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే వారికి ఆందోళనలకు మద్దతుగా టిడిపి నాయకులు నిలవనున్నారు. రాజధాని పర్యటనలో భాగంగా అమరావతి ప్రాంతాల్లోని గ్రామాల రైతులు చేస్తున్న దీక్షకు టిడిపి నేతలు సంఘీభావం తెలియజేయనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/