ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ..లోకేష్‌

అమరావతి కోసం ఉద్యమిద్దాం..జై అమరావతి

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేష్‌ రాజధాని కోసం రైతులు చేపట్టిన నిరసన దీక్షలు నేటితో 200 రోజులు పూర్తైన సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మూడు రాజధానులపై సిఎం జగన్‌ వైఖరి పట్ల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘జగన్ గారూ! మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను మూడు ముక్కలు చేసి మీ అవినీతి భాగస్వామికొకటి, మీ తప్పుడు పత్రిక నిర్వాహకునికి ఒకటి, మీ మామకొకటి ఇచ్చేసుకోడానికా… 29,881 మంది రైతులు రాజధాని అమరావతి కోసం త్యాగం చేసింది? మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం. 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా? రాష్ట్ర ప్రజలరా! ఇది రాజధాని రైతు సమస్య మాత్రమే కాదు. విధ్వంసకర పాలనకు, ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అందుకే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకంకండి. ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని’ అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దాం.జై అమరావతి!’అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/