కరోనాతో టాలీవుడ్‌ నిర్మాత కన్నుమూత

నేటి భారతం, వందేమాతరం సినిమాలకు సమర్పకుడు

కరోనాతో టాలీవుడ్‌ నిర్మాత కన్నుమూత
Producer Pokuri Rama Rao dies due to Covid-19

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజిృంభిస్తుంది. తాజాగా తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు(64) ఈ రోజు ఉద‌యం కరోనా సోకి మృత్యువాతపడ్డారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడు పోకూరి రామారావు. బాబూ రావు నిర్మించిన సినిమాలకు సమర్పకుడిగా రామారావు ఉండేవారు. నేటి భారతం, వందేమాతరం, ఎర్ర మందారం, దేశంలో దొంగలు పడ్డారు, యజ్ఞం, రణం వంటి వంటి సినిమాలకు సమర్పకుడిగా ఉన్నారు. పోకూరి రామారావు మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు కరోనా సోకడంతో గ‌త కొన్ని రోజులుగా హోం క్వారెంటైన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ స‌భ్యులకు నిర్వహించిన కరోనా టెస్టులు నెగిటివ్‌గా తేలినట్లు సమాచారం.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/