నీతి ఆయోగ్ సీఈవోను కలుసుకున్న చంద్రబాబు

నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడాలని సూచించిన మోడీ

chandrababu-meets-niti-aayog-ceo

న్యూఢిల్లీః టిడిపి అధినేత చంద్రబాబు నేడు నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ తో సమావేశమయ్యారు. జీ20 సమావేశంపై మాట్లాడాలన్న ప్రధాని సూచన మేరకు చంద్రబాబు పరమేశ్వరన్ అయ్యర్ తో భేటీ అయ్యారు. విజన్ డాక్యుమెంట్ కు సంబంధించి తన అభిప్రాయాలతో కూడిన నోట్ ను చంద్రబాబు ఈ సందర్భంగా పరమేశ్వరన్ అయ్యర్ కు అందించారు.

నిన్న ఢిల్లీలో జరిగిన జీ-20 సన్నాహక అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మోడీ ఆసక్తి కనబరిచారు. చంద్రబాబు సూచించిన అంశాన్ని తన ప్రసంగంలోనూ పేర్కొన్నారు. ఈ సందర్భంగానే డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/